సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నూతన కమిటీ మంగళవారం సెక్రటేరియేట్లో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నండూరి హరీశ్, సన్నీ, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, సహాయ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, కోశాధికారి విజయ్ ఉన్నారు.