నిధులు దుర్వినియోగం కాకుండా చర్యలు
పంచాయతీలు, మండల పరిషత్‌లలో జీరో అకౌంట్స్ ఓపెన్
కీసర, ఏప్రిల్ 13 : పల్లెల ప్రగతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్న నేపథ్యంలో పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి స్థానిక సంస్థల జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం కొత్త ఖాతాలను తెరువాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతితో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుండగా జిల్లా, మండల పరిషత్‌ల ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిధులు దుర్వినియోగం కాకుండా పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంను తీసుకొచ్చి నిధులపై నిఘా ఉంచేందుకు చర్యలు తీసుకుంటుంది.
ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15వ ఆర్థిక సంఘం కింద ప్రతి నెలా గ్రామపంచాయతి, మండల, జిల్లా పరిషత్‌లకు నిధులను కేటాయిస్తున్నారు. అయితే గతంలో పంచాయతి నిధులు, డీపీవో, మండల పరిషత్, జడ్పీశాఖ ఖాతాల్లో జమచేసిన తరువాత ఆ నిధులను ఆయా మండలాలకు విడుదల చేసేవారు. ఈ నిధుల కోసం జీపీ, మండల, జెడ్పీ ఖాతాలను ఎస్బీఐ ద్వారా కరెంట్ ఖాతా ఉంటేనే జమయ్యేది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం పాత ఖాతాలు కాకుండా కొత్త ఖాతాలను తెరువాలని పంచాయతీలను ఆదేశించడంతో మూడు రోజుల నుంచి సర్పంచ్, ఉపసర్పంచ్ పేర్లమీద ఎస్బీఐలో జీరో ఖాతాలు తెరుస్తున్నారు.
ప్రభు త్వం ఎప్పుడు నిధులు విడుదల చేసినా నేరుగా వారి ఖా తాల్లోనే జమ కానున్నాయి. గ్రామాల్లో ఏ అవసరం ఉన్నా పంచాయతీ తీర్మానం చేసి ఆ నిధులను వినియోగించేందుకు అవకాశం రానుంది. గతంలో కరెంట్ ఖాతాలు ఉండటం వల్ల నిధులను డ్రా చేయడంలో జాప్యం జరిగేది. ప్రస్తుతం పంచాయతీల్లో జమ అయిన నిధులు అవి ఏ పనికి ఎంతరవకు ఉపయోగించాలి. మిగిలిన నిధులెన్ని అన్న వివరాలు పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ప్రతి ఒక్కరికీ తెలిసే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా నిధులు దుర్వినియోగం కాకుండా ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల స్ఙానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీలకు జీరో ఖాతాలు తెరిచాం
ప్రభుత్వ ఆదేశానుసారం పంచాయతీలు, మండల పరిషత్‌లకు జీరో ఖాతాలను తెరిచాం. మండలంలోని కీసర, అంకిరెడ్డిపల్లి, చీర్యాల్, గోధుమకుంట, భో గారం, తిమ్మాయిపల్లి, నర్సంపల్లి, రాంపల్లిదాయర, యాద్గార్పల్లి, కరీంగూడ పంచాయతీలకు సర్పంచ్‌లతో జీరో ఖాతాలను తెరిపించాం. ఇక మండల పరిషత్‌కు కూడా ఖాతాలను ప్రారంభించాం.
– కీసర ఎంపీడీవో పద్మావతి
చాలా సంతోషంగా ఉంది
తెలంగాణ ప్రభుత్వం నిధు లు దుర్వినియోగం కాకుండా జీరో బ్యాంకు ఖాతాలను తీ యాలని నిర్ణయించడం సం తోషంగా ఉంది. పంచాయతి కరెంట్ ఖాతాల్లో వేసేందుకు 20 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు నేరుగా పంచాయతి ఖాతాల్లోకి డబ్బులు పడడం బాగుంది.
– నాయకపు మాధురి కీసర సర్పంచ్
ఖాతాలు తెరువడం ఆనందంగా ఉన్నది
తెలంగాణ ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌గా పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. ప్రతి నెలా నేరుగా పంచాయతి ఖాతాల్లో నిధులను వేయడంతో గ్రామా ల్లో అనేక పనులు చేపట్టేందుకు వీ లు కలిగింది. ప్రభుత్వం ఖాతాలను తెరువడం చాలా ఆనందంగా ఉన్నది.
-ఆకిటి మహేందర్‌రెడ్డి, గోధుమకుంట సర్పంచ్