సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తేతెలంగాణ) : వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమయ్యే కోఠి ఉమెన్స్ యూనివర్సిటీలో ప్రస్తుతం కొనసాగుతున్న కోర్సులకు అదనంగా కొత్త కోర్సులను ప్రవేశ పెట్టనున్నారు. ఎమర్జింగ్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్(ఎంఎల్) డాటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు బోధించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
వీటికి ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకోవడంతోపాటు వర్సిటీలో కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం కాలేజీలో 19 యూజీ, 20 పీజీ కోర్సులతోపాటు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు బోధిస్తున్నారు.