కొండాపూర్, డిసెంబర్ 17 : బీఆర్ఎస్ పార్టీ యువతకు పెద్ద పీట వేస్తుందని, వారి భవిష్యత్తుకు అండగా ఉంటుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి అన్నారు. బుధవారం కొండాపూర్ డివిజన్ బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ కార్తీక్‌తో పాటు ఆయన అనుచరగలం అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో గులాబీ పార్టీలో చేరడాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత బీఆర్ఎస్ పార్టీలో చేరాలని, వారి రాజకీయ భవిష్యత్తుకు పార్టీ అండగా ఉంటుందన్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌లు ఢిల్లీ గులాం గిరీ చేస్తాయని, తెలంగాణ ప్రజలు కేసీఆర్, గులాబీ పార్టీని కోరుకుం టున్నారన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్లారెడ్డి, సంగారెడ్డి, చారీ, రాము, అన్వర్, శివ, నాగరాజ్, బాలాజ్, సాయిబాబు, శ్రీను, చిన్న, పవన్, అనంతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.