హిమాయత్‌నగర్: కృత్రిమ పద్ధతిలో మామిడి పండ్లను మగ్గబెట్టి విక్రయిస్తున్న ఓ గోదాంపై నారాయణగూడ పోలీసులు దాడి చేశారు. సీఐ సైదేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్‌కట్టకు చెందిన షేక్ సమీర్ పండ్ల వ్యాపారి. బాట సింగారం పండ్ల మార్కెట్ నుంచి మామిడి కాయలను కొనుగోలు చేసి హిమాయత్‌నగర్‌లో అద్దెకు తీసుకున్న గోదాంలో నిల్వ ఉంచుతాడు.
మామిడి కాయలు వేగంగా పక్వానికి వచ్చేందుకు గోల్డ్ రైప్ ఇథిలీన్ రైపెనర్ను ఉపయోగిస్తున్నాడు. సహజ సిద్ధంగా చెట్లపై మగ్గిన పండ్లు అంటూ వినియోగదారులను నమ్మించి.. అమ్ముతున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు గోదాంలో తనిఖీలు నిర్వహించగా, 38 ట్రేలలో ఉన్న సుమారు 684 కేజీల మామిడి పండ్లు, 211 గోల్డ్ రైప్ ఇథిలీన్ రైపెనర్ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వర్కర్ ఎండీ మహ్మద్ ఖాజాపాషా అదుపులోకి తీసుకోగా, గోదాం యజమాని షేక్ సమీర్ పరారీలో ఉన్నాడు. ఎస్సై శ్రీవాణి దర్యాప్తు చేస్తున్నారు.