సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 ( నమస్తే తెలంగాణ) : భారీ వర్షాలతో నిరాశ్రయులైన తెలంగాణ ప్రజలకు చేయూతనివ్వడంలో భాగంగా నారాయణ విద్యాసంస్థలు,
సీఎం సహాయనిధికి రూ. 2.5 కోట్ల విరాళం ప్రకటించింది. మేనేజింగ్ డైరెక్టర్లు పునీత్ కొత్తప, సింధూర నారాయణ, శరణి నారాయణ చెక్కును బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.