మైలార్‌దేవ్‌పల్లి, జూలై 5 : ప్రజలకు సమస్యలు ఉంటే వాటిని తన దృష్టికి తేవాలని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ అన్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అడికే రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కాలనీలో ఉన్న డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ.. లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో నెలకొన్న సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. మొదట డ్రైనేజీ పైపులైన్లను వేసి ఆధునీకరించడం పూర్తయిన తరువాత నూతన సీసీరోడ్లు వేయిస్తామన్నారు. అధికారులతో కలిసి పర్యటించి ప్రణాళిక రూపొందించాలని ఆదేశిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు రాధాకృష్ణ, రఘు, రవీందర్, హనుమాన్లు, తిరుపతిరెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.