Mushirabad constituency | ముషీరాబాద్ నియోజక వర్గ అభివృద్ధే నా లక్ష్యం : ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్ నియోజక వర్గ అభివృద్దే లక్ష్యంగా తాను శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్నానని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
కవాడిగూడ : ముషీరాబాద్ నియోజక వర్గ అభివృద్దే లక్ష్యంగా తాను శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్నానని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
ఈ మేరకు సోమవారం టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో కవాడిగూడ డివిజన్లోని సింగాడికుంటలో తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ముఠా జయసింహలను హైదర్‌గూడలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో సింగాడికుంట వాసులు ఘనంగా సత్కరించారు.
కవాడిగూడ డివిజన్లోని సింగాడిగుంట కాలనీ ఎత్తుగా ఉండడంతో తాగునీటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డామని, ఎమ్మెల్యే ముఠా గోపాల్ చొరవ తీసుకుని నీటి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు సింగాడికుంట వాసులు రుణపడి ఉంటారని వారు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కవాడిగూడ సీనియర్ నాయకులు వల్లాల శ్రీనివాస్ యాదవ్, కరణ్, ఎల్లేష్, ప్రేమ్, కార్తిక్, రవీందర్, సుదర్శన్, చందు, ప్రశాంత్, జె. రాజేశ్, రాజు, కిరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

