టెండర్ల వేళ..నిరసన సెగ
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకతను ఎదురొంటున్నాయి.
- సరార్ చర్యలతో మూసీ బాధితుల ఆగ్రహం
- భూ సేకరణకు సహకరించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
- మేపుల్ హోమ్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం
సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకతను ఎదురొంటున్నాయి. సరైన సంప్రదింపులు లేకుండా, భూ సేకరణ ప్రక్రియ కొలికి రాకముందే టెండర్లతో ముందుకు వెళ్తుండటంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజేంద్రనగర్ సరిల్ పరిధిలోని మేపుల్ టౌన్ విల్లాస్ నివాసితులు తమ భూములను ఇచ్చేది లేదంటూ తేల్చిచెబుతుండగా, మూసీ పరివాహాకం వెంబడి ఉన్న భూ యజమానులు సర్కార్ తీరుతో ఎదురు తిరుగుతున్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా రాజేంద్రనగర్ సరిల్ పరిధిలోని మేపుల్ టౌన్ విల్లాస్ నుంచి సుమారు 49 గుంటల భూమిని ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది. అయితే, ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తే విల్లావాసుల ఉమ్మడి సౌకర్యాలు (కమ్యూనిటీ స్పేస్), పారింగ్, ఇతర వసతులు పూర్తిగా దెబ్బతింటాయని అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవన ప్రమాణాలను, నివాస హకులను దెబ్బతీసేలా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బాధితులు మండిపడుతున్నారు. భూ సేకరణ లేకుండా, స్థానికుల అంగీకారం తీసుకోకుండా హడావుడిగా టెండర్లు పిలవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తీవ్రరూపం దాల్చుతున్న భూసేకరణ వ్యవహారం
కేవలం టెండర్ల పేరిట వేలాది కోట్ల ప్రజాధనాన్ని సొంత కంపెనీలకు కట్టబెట్టడానికి మాత్రమే కాంగ్రెస్ పెద్దలు ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయినా కూడా సర్కారు ఎలాంటి డీపీఆర్ లేకుండా టెండర్లు, భూసేకరణ పనులను చేపట్టింది. ఇదే ఇప్పుడు తీవ్ర సమస్యగా రూపం దాల్చుతున్నది.
దీంతో మేపుల్ హోమ్స్ అసోసియేషన్ సభ్యులు ప్రాజెక్టు పేరుతో తమ నోటికాడి కూడును, ఆవాసాలను లాకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. అడ్డగోలు విధానాలతో తమ నివాసాలకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళనలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టుకు అవసరమైన భూములను ఇచ్చేది లేదనీ తేల్చి చెబుతున్నారు.
సరార్‌పై విమర్శలు
ప్రజా సంక్షేమం కోసమంటూ చేపడుతున్న ప్రాజెక్టుల్లో కనీసం బాధితులతో మాట్లాడకపోవడంపై విమర్శలు వసున్నాయి. ఓ వైపు క్షేత్రస్థాయిలో భూ సేకరణపై స్పష్టత రాకముందే టెండర్లు పిలవడం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని యజమానులు అంటున్నారు. వారసత్వంగా వచ్చిన భూములపై చట్టపరమైన హకులను, తమ ఆస్తులను కాపాడుకునేందుకు అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్లు అసోసియేషన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో మూసీ ప్రాజెక్టులో ఈ నిరాకరణ సెగ రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలకు దారితీసేలా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

