మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 26 : జిల్లాలోని మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు రూ. 21 వేల వేతనాన్ని చెల్లించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు ఎ.అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
మున్సిపల్ కార్మికులకు గత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అనారోగ్యానికి గురైన, పని చేయలేని స్థితిలో ఉన్నా.. కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. నూతన పీఆర్సీలో కనీస వేతనం రూ. 26 వేలు నిర్ణయించాలని, మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్, ఉన్నికృష్ణన్, సోమయ్య, స్వప్న, బాలనరసింహ, ఎల్లయ్య, సూరి, మహేశ్, సురేశ్, మధు, పాల్గొన్నారు.