గౌతంనగర్, మార్చి 13 : మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో వరద ముంపు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకే బాక్స్ డ్రైన్, కల్వర్టుల నిర్మాణాలకు శ్రీకారం చు ట్టారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రత్యేక కృషి, నిధులు మంజూరు చేయడంతో పనులు వేగంగా జరుగు తున్నాయి. గౌతంనగర్ డివిజన్, ఉత్తంనగర్ పై భాగంలో ఉన్న ఆర్మీ ల్యాండ్ నుంచి చిన్నపాటి వర్షాలకు పెద్ద ఎత్తు న వరదలు వచ్చి ఉత్తంనగర్తో పాటు చాణుక్యపురి, ఆర్కేనగర్, సఫిల్‌గూడ ప్రాంతాల్లో ఉన్న కాలనీల్లోకి వర ద, మురుగునీరుచేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడేవా రు. ఈ సమస్యను పరిష్కరించడానికి స్థానిక కార్పొరేటర్ మేకల సునీతారాము యాదవ్ ఉత్తంనగర్లో బాక్స్డ్రైన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి ని కోరగా… వెంటనే ఆయన రూ.55లక్షల నిధులను మంజూరు చేయించారు. దీంతో పనులు వేగంగా సాగుతున్నాయి.
మల్కాజిగిరి సర్కిల్లో ఎక్కువగా వరద, మురుగు సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ సమస్యల కోసం బాక్స్ డ్రైన్, కల్వర్టుల నిర్మాణాల కోసం మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేశారు. ముంపు ప్రాంతాలను గుర్తిం చి.. కోట్లాది రూపాయలతో బాక్స్ డ్రైన్, కల్వర్టు పనులు చే పట్టాం. ప్రస్తుతం దాదాపు 80శాతం డ్రైనేజీ పనులు పూర్తి చేశాం. మిగతా 20శాతం పనులు నడుస్తున్నాయి.
– మైనంపల్లి హన్మంతరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే
కొన్నేండ్లుగా చిన్నపాటి వర్షాలకు ఆర్మీ ల్యాండ్ నుంచి వచ్చే వరదలు ఇండ్లలోకి చేరి ఇబ్బందులుపడేవారు. వర ద ముంపు సమస్యను పరిష్కారించాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును కోరగా వెంటనే నిధులు మంజూరు చే యించారు. దీంతో బాక్స్ డ్రైన్ పనులు నడుస్తున్నాయి. ఈ పనులు పూర్తైతే వరదముంపు సమస్య తీరనున్నది. మిర్జాల్‌గూడ, జ్యోతినగర్, ఉత్తంనగర్ లలో బాక్స్ డ్రైన్ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఙతలు.
– మేకల సునీతారాముయాదవ్ , గౌతంనగర్ కార్పొరేటర్.