బేగంపేట్ నవంబర్ 5: కుటుంబ కలహాలతో ఓ గృహిణి రెండున్నర ఏండ్ల కూతురుతో కలిసి హుస్సేన్ సాగర్ నీటిలో దూకి ఆత్మహాత్య పాల్పడింది. ఈ ఘటన రెండు రోజుల క్రితం హుస్సేన్‌సాగర్ లేక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓల్డ్ సిటీకి చెందిన పృధ్వీలాల్, కార్తీక అగర్వాల్ భార్యభర్తలు, వీరికి రెండున్నర ఏండ్ల కూతురు ఉంది. పృధ్వీలాల్ చార్టర్డ్ అకౌంటెంట్. గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య కలహాలు రావడంతో కార్తీక బహుదూర్‌పల్లిలోని పుట్టింట్లో ఉంటుంది. ఈ నెల రెండవ తేదీన కార్తీక తన కూతురుతో కలిసి ఎవ్వరికి చెప్పకుండా బయటకు వచ్చింది. దీనిపై కుటుంబ సభ్యులు బహుదూర్‌పుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అక్కడ పోలీసులు మిస్సింగ్ కేస్ నమోదు చేశారు. సోమవారం రాత్రి హుస్సేన్ సాగర్ నీటిలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అప్పుడు లేక్ పోలీసులు గుర్తు తెలియని మహిళ మృతదేహాంగా కేసు నమోదు చేశారు. ఈక్రమంలో విచారణ జరుపుతున్న పోలీసులకు కార్తీక కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగ కార్తీక అగర్వాల్ అని గుర్తించారు. మరుసటి రోజు రెండున్నక ఏండ్ల చిన్నారి మృతదేహాన్ని కూడా లేక్ పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసును బహుదూర్‌పుర పోలీస్‌స్టేషన్‌కు బదిలి చేసినట్టు లేక్ పోలీసులు తెలిపారు.