Petlaburj Maternity Hospital | మార్పు అంటే ఇదేనేమో అని అందరూ అనుకుంటున్నారు.. చార్మినార్, మే 28 : అక్కడ ఏ పని జరగాలన్నా ఆయన అనుమతి తప్పనిసరి. ఎక్కడ ఏ సిబ్బంది విధులు నిర్వహించాలన్నా ఆయన చెప్పిందే ఫైనల్. పోస్టుకు ఓ రేటు కట్టి నెలవారి టార్గెట్ ఫిక్స్ చేసి దర్జాగా అక్రమాలకు అలవాటుపడ్డారు. సిబ్బందిని పరోక్షంగా అవినీతికి ప్రోత్సహించి అడ్డూ అదుపు లేకుండా వ్యవహరించారు. షాడో సూపరింటెండెంట్‌గా చలామణి అవుతూ అసుపత్రిని బ్రష్టు పట్టించారు.
రాష్ట్రంలోనే అతిపెద్దదైన పేట్లబుర్జ్ మోడ్రన్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చోటు చేసుకున్న అరాచకాలు ఒక్కోటి బయట పడుతున్నాయి. గత సూపరింటెండెంట్ రజిని రెడ్డి హయాంలో జరిగిన విధ్వంసకాండను సిబ్బంది ప్రస్తుతం బాహాటంగానే చర్చిస్తున్నారు. రజిని రెడ్డి తన వద్ద ప్రత్యేకంగా గుంటూరుకు చెందిన వరప్రసాద్ అనే వ్యక్తిని నియమించుకుంది. ఆయన నెలవారి జీతం సైతం కాంట్రాక్టు ప్రతిపాదికన సిబ్బంది చెల్లింపులు చేసేవారు. ఆసుపత్రిలో అంతా వరప్రసాద్ చెప్పినట్లే జరగాల్సి వచ్చేది. సూపరింటెండెంట్‌ను కలవాలంటే వరప్రసాద్ అనుమతి ఉంటేనే సాధ్యమయ్యేది.
బలిపశువులుగా మారిన సిబ్బంది..
ఆసుపత్రిలో ఆదాయం సమాకురే చోట విధులు నిర్వహించాలంటే ఓ రేటు.. ప్రధాన ద్వారం వద్ద విధులంటే మరో రేటు.. ఇలా రేట్స్ ఫిక్స్ చేసి నెలవారీగా ఒక్కో సిబ్బంది వద్ద రూ.15 వేలు వసూళ్లు చేశారు. అతని మాటకు ఎదురు తిరిగితే జన సంచారం, కనీసం విధులు ముగిసే వరకు ఎవరూ కాంట్రాక్ట్ ఉండని ప్రదేశాల్లో విధులు కేటాయించేవారని సిబ్బంది తెలిపారు. ఆసుపత్రిలో పర్మినెంట్ సిబ్బందిగా కొనసాగుతున్న 10 మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని సైతం వేధించేవాడు. అటెండెన్స్ ఇచ్చి వెళ్లడానికి నెలకు ఒక్కొక్కరి నుండి రూ.5వేలు వసూళ్లు చేసారని వాపోతున్నారు. మానవత్వం మరిచి సూపరింటెండెంట్ డిమాండ్ చేస్తున్నారని.. పీడించారని సిబ్బంది వెల్లడించారు.
సూపరింటెండెంట్ రజినీ రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. అనంతరం ఆదివారం రోజున అధికారులు అందుబాటులేని సమయంలో ఆసుపత్రిలోకి ప్రవేశించిన వరప్రసాద్ ఎవరి అనుమతి లేకుండానే సూపరింటెండెంట్ ఆఫీస్‌లోకి ప్రవేశించి పలు డాక్యుమెంట్స్ తీసుకెళ్లారని అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలా వద్ద అనే విషయంలో ఆసుపత్రి అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని తేలిపోయింది : కేటీఆర్
Bad Breath | నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలను పాటించండి..!
Jio Electric Scooter | మార్కెట్లో జియో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇవీ ఆ స్కూటర్ ప్రత్యేకతలు