సైదాబాద్, అక్టోబర్ 17:ముగ్గురు బాలికలపై పక్కింటిలో నివసించే మహ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు తమ మొబైల్ ఫోన్లోని అశ్లీల ఫొటోలు, అసభ్య వీడియోలను చూపించి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటకి చెబితే చంపేస్తానని బెదిరించి పలు మార్లు లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సైదాబాద్ సపోటాబాగ్‌కు చెందిన ఓ మహిళకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు.
వీరు సైదాబాద్‌లోని ఓ పాఠశాలలో చదువుతున్నారు. మంగళవారం పాఠశాలలో ఇద్దరు కుమార్తెలతోపాటు పక్కనే నివసించే మరో బాలికతో కలిసి అసభ్యకరమైన విషయాలు మాట్లాడుకోవడాన్ని గమనించిన స్కూల్ టీచర్, బాలికల ప్రవర్తనపై అనుమానం వచ్చి వారి తల్లిని స్కూల్‌కు రప్పించారు. బాలికలు మాట్లాడుకున్న విషయాలను వివరించింది.
దీంతో తల్లి ఆవేశంతో ఏం జరిగిందని వారిని ప్రశ్నించగా.. తమపై ఇంటి పక్కనే నివసించే ఇర్ఫాన్ చేసిన దుర్ఘాతాన్ని వివరించారు. గత ఆగస్టు నెలలో సెలవు దినాల్లో బయట ఆడుకుంటుండగా ఇర్ఫాన్ లైంగికదాడికి పాల్పడినట్లు చెప్పారు. బాలికల తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ తెలిపారు.