సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దక్షిన, నైరుతి దిశల నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో రాబోయే 2రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
కాగా, సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 29.4, కనిష్ఠం 21.5 డిగ్రీలు, గాలిలో తేమ 77 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.