Mobile Snatching | బంజారాహిల్స్, ఫిబ్రవరి 27 : రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి మొబైల్ లాక్కుని వెళ్లిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనాసరుల్ రహ్మాన్(45) అనే వ్యక్తి సయ్యద్‌నగర్‌లో నివాసం ఉంటూ ఫిలింనగర్లో మగ్గం వర్క్స్ చేస్తుంటాడు. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పని ముగించుకుని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్ మీద ఇంటికి వెళ్తున్నాడు. సయ్యద్‌నగర్‌లోని అబ్దుల్లా బేకరీ వద్దకు రాగానే రెండు బైకుల మీద నలుగురు వ్యక్తులు వారికి ఎదురుగా వచ్చారు. ఓ బైక్ మీద వెనకాల కూర్చున్న గుర్తుతెలియని వ్యక్తి రహ్మాన్ చేతిలో ఉన్న రియల్ మీ ఫోన్‌ను లాక్కుని పారిపోయారు. ఈ మేరకు బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్ 304(2) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.