MLC Surabhi Vanidevi | ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : ఎమ్మెల్సీ సురభి వాణిదేవి
MLC Surabhi Vanidevi | ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ( MLC Surabhi Vanidevi ) పిలుపునిచ్చారు.
హైదరాబాద్ : ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ( MLC Surabhi Vanidevi ) పిలుపునిచ్చారు. జాతీయ వాస్కులర్ డే (National Vascular Day
) సందర్భంగా వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం మాదాపూర్లోని దుర్గం చెరువు వద్ద ‘వాక్ ఏ మైల్ టు లివ్ విత్ ఏ స్మైల్’ కాన్సెప్ట్తో వాకథాన్ (Walkathon) ను నిర్వహించారు. వాకథాన్ను ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఎస్ రావు, వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ పీసి గుప్తాతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని ( Healthy society) నిర్మించి రోగం లేని సమాజాన్ని కోరుకుందామని అన్నారు. మారుతున్న కాలానుగుణంగా జీవన శైలి, ఆహారపు అలవాట్లు మారిపోవడంతో అనారోగ్య సమస్యలు అధికమవుతున్నట్లు చెప్పారు. అందరూ మొబైల్ ఫోన్లు (Mobile Phones ) , కంప్యూటర్లకు (Computers) అతుక్కుపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
గతంలో రెండు కిలో మీటర్ల దూరం అవలీలగా నడిచేవారని, ఇప్పటి పిల్లల్లో ఆ పరిస్థితి లేదన్నారు. ప్రతి రోజు ఆరోగ్యంగా ఉండటానికి రోజు వారి నడక ఎంతో ముఖ్యమన్నారు. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోకరంగా ఉందని అభినందించారు. వాస్కులర్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఏసీపీ కేఎస్ రావు అన్నారు. భారతదేశం మధుమేహ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

