మలక్‌పేట, నవంబర్ 27: ఈ నెల 29 న నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ మహమూద్ అలీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కోరారు. బుధవారం సాయంత్రం ఆజంపురా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీక్షా దివస్‌ను పురస్కరించుకొని మలక్‌పేట నియోజకవర్గంలోని అక్బర్‌బాగ్ దిల్‌కుశ ఫంక్షన్హాల్లో హయ్యత్ హుస్సేన్ హబీబ్ ఆధ్వర్యంలో రక్తదాన, కంటి వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.
దిక్షా దివస్‌ను పురస్కరించుకొని ఈ నెల 29 నుంచి డిసెంబర్ 11 వరకు 11 రోజుల పాటు మలక్‌పేట నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి ఆజం అలీ, నాయకులు బాబు సుదర్శన్, భూమేశ్వర్, ప్రభాకర్‌రెడ్డి, అజిత్‌రెడ్డి, హయ్యత్ హుస్సేన్ హబీబ్, నర్సింగ్, శ్రీనివాస్‌రెడ్డి, నరేష్, సల్మాన్ మహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.