కవాడిగూడ, ఏప్రిల్ 7ః అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్ష చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణ జాగృతి నాయకులు నవీన్ ఆచారి, యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొళ్ల శివశంకర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులుఇందిరాపార్కు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు శ్రీధర్‌రావు,పెంటారాజేష్, యునైటెడ్ పూలే ఫ్రంట్నాయకులు హరి, సదానంద్, మారయ్య, వీరన్న, విజేందర్సాగర్, నరేష్కుమార్, అశోక్‌యాదవ్, లింగం, శాలివాహన, పుష్పచారి తదితరులు ఉన్నారు.