మలక్ పేట, మార్చి 9 : ఈ నెల7న ఔటర్ రింగ్ రోడ్డుపై పెద్ద గోల్కొండ తుక్కుగూడ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారున్ని కోల్పోయి శోక సంద్రంలో ఉన్న మాజీ కార్పొరేటర్ తీగల సునరితా రెడ్డి, బీఆర్ఎస్ మలక్ పేట నియోజకవర్గ ఇన్చార్జి తీగల అజిత్ రెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం సలీంనగర్లోని వారి నివాసానికి చేరుకున్న కవిత కనిష్క్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎదిగిన కుమారున్ని కోల్పోవడం తనను తీవ్రంగా కలిసి వేసిందని, ఆ లోటును ఎవరు పూడ్చలేరని, ధైర్యంగా ఉండాలని ఆమె సూచించారు. ఎమ్మెల్సీ కవిత వెంట మాజీ మంత్రి మహమ్మద్ అలీ, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్, టీఆర్ఎస్ గ్రేటర్ నాయకుడు ఆజాం అలీ, మలక్పేట్ సోషల్ మీడియా ఇన్ చార్జి తడకమళ్ళ నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు రాధ, భూమేష్, అభిషేక్, నరేష్ తదితరులు ఉన్నారు.