విఫల ప్రణాళికలకు 99 రోజులెందుకు?
గతంలో విఫలమైన ప్రణాళికలకు ఇప్పుడు 99 రోజులెందుకని, మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టారా?అని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక- 99 రోజుల యాక్షన్ ప్లాన్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
- ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): గతంలో విఫలమైన ప్రణాళికలకు ఇప్పుడు 99 రోజులెందుకని, మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టారా?అని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక- 99 రోజుల యాక్షన్ ప్లాన్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. 99 రోజుల ప్రణాళికపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాలని కోరారు. గతంలో అనేక ప్రణాళికలు, ప్రయోగాలు చేసినా ఆశించని ఫలితాలు ఇవ్వలేదని విమర్శించారు. కొత్తగా 99 రోజులని ఏ ప్రాతిపదికన నిర్ణయించారో ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమాలకు జిల్లాల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఏ ప్రాతిపదికన చేశారో వెల్లడించాలని కోరారు.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో దోమల బెడద తీవ్రంగా ఉందని, ఫాగింగ్ చర్యలు సమర్థంగా చేపట్టేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని సూచించారు. అనేక ప్రాంతాల్లో కుక్కల సమస్య తీవ్రంగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఈ 99 రోజుల్లో చేపట్టబోయే పనులు, లక్ష్యాలను స్పష్టంగా ప్రకటించాలని కోరారు. బస్తీ దవాఖానల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

