కాచిగూడ, మే 23: ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా తెలంగాణలో ఆనందంగా జీవించాలనే విశాల హృదయం కలిగిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. జైన్‌మందిర్ ప్రజల కోరిక మేరకు బర్కత్‌పురలోని భూమన్నలైన్లో జైన్ ప్రజలు 427 గజాల స్థలంలో నూతనంగా నిర్మిస్తున్న జైన్‌మందిర్, కమ్యూనిటీ హాల్ స్థలంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ రెండు లక్షలకు పైగా సొంత ఖర్చుతో మంగళవారం నూతన బోరింగ్‌తో పా టు చేతి పంపును పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ.. అంబర్‌పేట నియోజకవర్గంలో సొంత ఖర్చుతో 27 చేతి పంపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న జైన్, కన్నడ ప్రజల సమస్యలను గత ప్రభుత్వాలు ఏ కోశన పట్టించుకోలేదని, కనీసం వారిని కన్నెత్తి కూడ చూడలేదన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు దృఢ సంకల్పంతో సీఎం కృషి చేస్తున్నాడని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పలు బస్తీ, కాలనీల్లో తాగు నీటి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామని, డివిజన్లోని ప్రజలకు నీటి ఇబ్బందు లు తలెత్తకుండా లోప్రెషర్ ప్రాంతాలను గుర్తించి బస్తీ, కాలనీల్లో నూతన చేతి పంపులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నియోజక వర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ది చేస్తూ, మౌలిక సదుపాయలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం జైన్‌మందిర్ అధ్యక్షుడు ప్రవీణ్‌బాయి వోరా మాట్లాడుతూ.. జైన్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అంబర్‌పేట ఎమ్మె ల్యే కాలేరు వెంకటేశ్ మానవత దృక్ఫథంతో ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయమన్నారు. నూతనంగా నిర్మిస్తున్న జైన్‌మందిర్, కమ్యూనిటీ హాల్ నిర్నాణం సహయ, సహాకారాలు అందించడం గొప్ప నిర్ణయమన్నారు. ఈ కార్యక్రమంలో జైన్‌మందిర్ ఉపాధ్యక్షుడు ఉపేంద్రజీ భూరాత్ జైన్, ప్రధాన కార్యదర్శి వికాస్షా జైన్, పంకజ్ జైన్, అభయ్ జైన్, దీలిప్ జైన్, లలిత్ జైన్, కుల్ధీప్ జైన్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు భీష్మాదేవ్, డాక్టర్ శిరీషాయాదవ్, బద్దుల ఓం ప్రకాశ్‌యాదవ్, శ్రీకాంత్‌యాదవ్, పి.సంతోశ్, మహేందర్, బి.కృష్టాగౌడ్ పాల్గొన్నారు.
కరాటే పోటీలకు ఆహ్వానం
ఈనెల 27న తేదీన బర్కత్‌పుర జీవీఆర్ కరాటే అకాడమీలో ప్రదర్శిస్తున్న కరాటే ప్రదర్శనకు హాజరుకావాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు కరాటే మాస్టర్ జీఎస్ గోపాల్‌రెడ్డి మంగళవారం ఆహ్వా న పత్రాన్ని అందజేశారు. తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2వ తేదీన ‘ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో పేరు నమోదు కోసం ఇద్దరు కరాటే బాలికలు అమృతరెడ్డి, ఘన సంతోషినిరెడ్డి (అక్కాచెల్లళ్ల) మధ్య పోటీ జరగనుంది.
– కాచిగూడ, మే 23