MLA Thalasani | ఆధ్యాత్మికతో మానసిక ప్రశాంతత : ఎమ్మెల్యే తలసాని
MLA Thalasani | నిత్యం పని ఒత్తిడితో ఉండేవారికి కేవలం ఆధ్యాత్మిక చింతన(Spirituality) ద్వారానే ప్రశాంతత లభిస్తుందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు.
బన్సీలాల్‌పేట్, మార్చి 31 : నిత్యం పని ఒత్తిడితో ఉండేవారికి కేవలం ఆధ్యాత్మిక చింతన(Spirituality) ద్వారానే ప్రశాంతత లభిస్తుందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు. తన సొంత నిధులతో పద్మారావునగర్ కాలనీలో పునర్ నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ మొదటి వార్శికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారి జరిగిన పూజలలో పాల్గొన్న ఆయనను పండితులు ఆశీర్వదించారు.
అనంతరం ఆలయ కమిటీ ప్రతినిథులు సాయిరామ్ చారి, హరిచారిల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జిల్లా సాధన కమిటీ అధ్యక్షుడు జి.పవన్‌కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కే.లక్ష్మిపతి, వెంకటేశన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మహిమ గల ఆలయ పునర్ నిర్మాణానికి సహకారం అందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసానికి కాలనీవాసులు ధన్యవాదములు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

