అమీర్‌పేట్, నవంబర్ 21 : వాహనాల రాకపోకలకు మెరుగైన రహదారుల వ్యవస్థను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఫతేనగర్ ఫ్లైవర్ కింద సనత్‌నగర్‌లోని లోధా క్లబ్ హౌస్ నుండి మెథడిస్ట్ చర్చి వరకు రూ.33 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ కార్పొరేటర్ కొలను లక్ష్మితో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఫతనగర్ ఫ్లై ఓవర్ కింద ఉన్న మెథడిస్ట్ చర్చి రోడ్డు మీదుగా లోధా క్లబ్ హౌస్ వరకు ప్రత్యామ్నాయం మార్గంగా ఉన్న ఈ రోడ్డు శిధిలావస్థకు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే ఈ రహదారి నిర్మాణాలు పూర్తయితే మెథడిస్ట్ చర్చి రోడ్డు నుండి లోధా క్లబ్ హౌస్ మీదుగా సనత్‌నగర్ బస్టాండ్ చేరుకునేందుకు భారీ వాహనాలు మినహా ఇతర వాహనాలు సౌకర్యవంతంగా ఈ మార్గంలో రాకపోకలు సాగించగలవు. వాహనదారులు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఇక్కడి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభానికి చొరవ తీసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాప్యాదవ్కు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ , డీఈ సందీప్, వైద్యధికారి చంద్రశేకర్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఏడీఈ వంశీకక్రిష్ణ, జలమండలి డీజీఎం శ్రీనివాస్, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ సురేష్‌లతో పాటు బీఆర్ఎస్ నాయకులు కొలను బాల్‌రెడ్డి, సురేష్‌గౌడ్, దాడి ప్రవీణ్‌రెడ్డి, వడ్డె కరుణాకర్‌రెడ్డి, ఖలీల్, ఫాజిల్, కరీం లాలా తదితరులు పాల్గొన్నారు.