బేగంపేట, నవంబర్ 27: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరులో ఉద్యమ నేత కేసీఆర్ తన ప్రాణాలకు తెగించి చేసిన ఆమరణ దీక్ష చరిత్రలో నిలిచిపోయిందని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష..ఢిల్లీ పెద్దలను కదిలించిన తీరు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన ఘట్టమన్నారు.
బుధవారం మారేడ్‌పల్లిలోని తన నివాసంలో జరిగిన సనత్‌నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశంలో ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ దీక్షా దివస్ నేపథ్యంలో 29న మధ్యాహ్నం 2.30 గంటల వరకు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులంతా కలిసి బేగంపేట పాటిగడ్డలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌కు తరలిరావాలని, అక్కడి నుంచి దదాపు 3 వేల బైక్‌లతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వరకు, తిరిగి అక్కడి నుంచి భారీ సమూహంతో తెలంగాణ భవన్‌కు చేరుకోవాలన్నారు.