మారేడ్‌పల్లి, డిసెంబర్ 20: ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెత్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మోండా డివిజన్ లో 95.60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ముందుగా పాట్ మార్కెట్ లో 49.70 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ ప్రారంభించారు. అనంతరం సజ్జన్లాల్స్ట్రీట్ లో45.9 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డును ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ దీపికతో కలిసి ప్రారంభించారు.
స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే తలసాని దృష్టికి తీసుకొని రాగా , వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పాట్‌మార్కెట్, సజ్జన్‌లాల్ స్ట్రీట్ ప్రాంతాల్లో 95.60 లక్షల రూపాయాల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్, ఈఈ సుబ్రహ్మణ్యం , వాటర్ వర్క్స్ జీఎం వినోద్, శానిటేషన్ డీఈ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, మోండా మార్కెట్ లోని ఇస్లామియా స్కూల్ సమీపంలో గల శ్రీ రామ ఎంటర్ ప్రైజెస్ డిస్పోజబుల్ ప్లేట్స్, గ్లాస్‌ల హోల్ సెల్ షాప్ శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివా స్‌యాదవ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడు దినేశ్ కుమార్‌ను పరామర్శించి మ్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరిపి బాధితుడిని ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.