హైదరాబాద్ : లష్కర్ కార్పోరేషన్(Lashkar Corporation) ఏర్పాటు చేయాల్సిందేనని సనత్‌నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ధర్నా చౌక్‌లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్ పాపాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ..200 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని కార్పోరేషన్‌గా ఏర్పాటు చేయాలనేది ఈ ప్రాంత ప్రజల డిమాండ్ అన్నారు.
మా ప్రాంతం నుంచి వచ్చే ఆదాయాన్ని మా ప్రాంత అభివృద్ధికే ఖర్చు చేయాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ఈ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో డివిజన్ల విభజన కూడా శాస్త్రీయంగా జరగలేదని ఆరోపించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మికి కూడా తెలవకుండా డివిజన్ల విభజన జరగడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.