బేగంపేట్ ఏప్రిల్ 17: యాదవుల అభివృద్ధి, హక్కుల సాధన కోసం కృషి చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల సనత్నగర్ నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన గెలుబోయిన కుమార్ యాదవ్, పలువురు యాదవ సంఘం నేతలు గురువారం వెస్ట్ మారేడ్ పల్లిలోని కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కుమార్ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో యాదవ సంఘం నాయకులు రాములు యాదవ్, సత్యనారాయణ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, బాలేష్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, కిశోర్ యాదవ్, రఘు యాదవ్, మధు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, అరుణ్ గౌడ్, రాజేందర్ తదితరులు ఉన్నారు.