చిక్కడపల్లి, ఏప్రిల్ 27 : తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక గులాబీ జెండా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాజతోత్సవం సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఎమ్మెల్యే ముఠాగోపాల్‌తో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు.
ఎన్నో పోరాటాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు ముఠా జయసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్, రాకేష్ , ముఠా నరేష్ , పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.