బేగంపేట్ మార్చి 9 : కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )అన్నారు. అమీర్ పేటలోని బుద్దా నగర్ కాలనీకి నూతగా అధ్యక్షుడిగా ఎన్నికైన బాజీబాబా, కాలనీ వాసులతో ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బాజీబాబాకు శుభాకాంక్షలు తెలిపారు.
కాలనీలోని సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పలు సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించగా త్వరలోనే బుద్దా నగర్ లో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ రెడ్డి, కాలనీ వాసులు వినోద్, శ్రీను, భిక్షపతి, జహంగీర్, సుమన్, రాము, గోపి, తదితరులు పాల్గొన్నారు.