అమీర్‌పేట్ : నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలు భారం కావొద్దని నాటి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబార్ పథకాలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం అందజేస్తున్న కల్యాణ లక్ష్మి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్(MLA Talasani )పేర్కొన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్‌పల్లి కమ్యూనిటీ హాలులో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారితో కలిసి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి( Kalyanalakshmi) చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఆ దృష్టితోనే పేదల బస్తీల్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణాలు చేపట్టిందన్నారు. నామమాత్రపు అద్దెలకే పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అర్హులైన ప్రతిఒకరు ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలను సద్విరియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అశోక్‌యాదవ్, దాడి ప్రవీణ్‌రెడ్డి, కూతురు నర్సింహ, బన్సీలాల్‌పేట్ డివిజన్ అధ్యక్షులు వెంకటేశన్ రాజు, ఏసూరి మహేష్, కూర్మ లక్ష్మిపతి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.