బేగంపేట్ జనవరి 29 : పేదింటి ఆడపడుచుల పెండ్లికి మొట్టమొదటగా ఆర్థిక సహాయం అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్(MLA Talasani )అన్నారు. బుధవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన కార్యాలయంలో అమీర్‌పేట్, బేగంపేట్ డివిజన్లకు చెందిన 30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద, మద్య తరగతి కుటుంబాలకు ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే ఆర్థికంగా ఎంతో భారంగా మారిందన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని వారికి చేయూత నివ్వాలనే ఆలోచనతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక లక్షా నూట పదహార్లు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి నాడు కేసీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శేఖర్ ముదిరాజ్, శ్రీనివాస్‌గౌడ్, నర్సింహా, గోపిలాల్ చౌహాన్, అఖిల్, ఆరీఫ్, తదితరులు పాల్గొన్నారు.