ఎల్బీనగర్, మే 20 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులకు, ఉద్యమకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శిక్షణా శిబిరం విజయవంతం అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలోని ఉద్యమ కారులు వేదికపై తమకు సముచిత స్థానం కల్పించినందుకు ఎమ్మెల్యేని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని ఎల్బీనగర్లో పఠిష్ట శక్తిగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలన్నారు.
పార్టీ శ్రేణులంతా క్రమశిక్షణలో శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారని అభినందించారు. ఉద్యమకారులు, ఉద్యమ నాయకులకు ఎల్లవేలలా అందుబాటులో ఉంటానని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి. సతీష్‌యాదవ్, గవ్వ శ్యాంసుందర్‌రెడ్డి, పోచబోయిన జగదీష్‌యాదవ్, సంబరాల శైలజ, రాగిరి ఉదయ్ గౌడ్, మల్లెపాక యాదగిరి, స్కైలాబ్, మధుగౌడ్, వట్నాల విశ్వేశ్వర్రావు, తో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు.