బడంగ్ పేట్, జూన్ 27: పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఆరా తీశారు. చెరువుల సుందరీ కరణ, రోడ్లు, నాలాల అభివృద్ధి, తదితర సమస్యలపై చర్చించారు. స్ట్రీట్ లైట్స్ అంశం పైన వ్యాధికాలని అడిగి తెలుసుకున్నారు. ప్లేగ్రౌండ్ లో ఇంకా చేయాల్సిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో చేపట్టాల్సిన పనుల గురించి చర్చించారు. ముంపు సమస్య తలెత్తకుండ జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. వర్షాకాలంలో వర్ధనీటి కాల్వలను క్లీన్ చేయించాలని సూచించారు. చెరువుల పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.
అభివృద్ధి పనులను, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్ పనులు పూర్తి కాకపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. కాలనీవాసులనుంచి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పైన ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి సమస్య పైన కులం కుశంగా అధికారులతో చర్చించారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సమీక్ష సమావేశంలో కమిషనర్ జ్ఞానేశ్వర్, డి ఈ వెంకన్న, ఏఎంసి నాగేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.