కందుకూరు. ఏప్రిల్ 4 : మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabita Indrareddy) మానవత్వం చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలో వివిధ గ్రామాల్లో జరిగిన వివాహలకు హజరై వలుతుండగా బైరాగిగూడ గేటు వద్ద మండల పరిధిలోని రాచులూరు గ్రామానికి చెందిన కుమ్మరి రమేష్ రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది.
ఈ సమయంలో అటుగా వెలుతున్న సబితా ఇంద్రారెడ్డి తన వాహనాన్ని ఆపి ప్రమాదానికి గైరైన వ్యక్తి వద్దకు వెల్లి జరిగిన విషయాన్ని తెలుసుకున్ని అతనికి వెటనే తాగునీరు అందించి వైద్యం కోసం హాస్పిటల్‌కి తరలించారు. ఆమె వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, యూత్ నాయకులు తాళ్ల కార్తీక్, తదితరులు ఉన్నారు.