కందుకూరు, జూన్ 1 : కందుకూరుకు మాజీ సీఎం కేసీఆర్ మంజూరు చేసిన మెట్రో రైలుతో పాటు 400 పడకల ఆసుపత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం సరికాదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహేశ్వరం ప్రజల అభివృద్ధి పట్ల నిజమైన చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే కళాశాల, ఆసుపత్రి, మెట్రోరైలు పనులు ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. ఆరోగ్యం, విద్యా, రవాణా, సౌకర్యాల కోసం ఈ ప్రాజెక్టులు అత్యంత అవసరమన్నారు.
జిల్లాకు మంజూరైన కళాశాలను కందుకూరుకు తీసుకువచ్చి.. తాను మాజీ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేస్తే ఇక్కడి నుంచి కళాశాల తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆసుపత్రి వస్తే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు.