పార్కుల అభివృద్ధికి కృషి
కాంక్రీట్ జంగల్గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో పార్కుల ఆవశ్యకత ఎంతో ఉందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
బడంగ్పేట్, జనవరి 11 : కాంక్రీట్ జంగల్గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో పార్కుల ఆవశ్యకత ఎంతో ఉందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఆడుకుంటున్న చిన్నారులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. మంత్రిగా ఉన్నప్పుడు దూరదృష్టితో పార్కులో ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలు, వాకింగ్ ట్రాక్లాంటి వాటిని నిత్యం వందలాది మంది ఉపయోగించుకుంటున్నారని తెలిపారు.
పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్న పెద్దలు సేద తీరటానికి ఎంతో ఉపయోగపడతుందని పేర్కొన్నారు. రోజు రోజుకు రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో మరింతగా పార్కును విస్తరించటానికి కృషి చేస్తానన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అర్బన్ పార్కులను ప్రజల కోసం తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాధి, నాయకులు యూసుఫ్ పటేల్, కౌన్సిలర్ శంషొద్దీన్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
Medicover | కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు.. మెడికవర్లో న్యాయవాది మృతి!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

