మణికొండ/చేవెళ్ల రూరల్, ఆగస్టు 1 : బీఆర్ఎస్ పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషిచేస్తున్న వారందరికీ భవిష్యత్‌లో తగిన గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం దూళిపాళ్ల, యువజన విభాగం అధ్యక్షుడు సంగం శ్రీకాంత్ నేతృత్వంలో శుక్రవారం పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా సబితారెడ్డి నివాసంలో వారికి నియోజవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరిస్తోందన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందంటే అందుకు అప్పటి బీఆర్ఎస్ సర్కారు వెచ్చించిన నిధులేనని కార్తీక్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పలువురు యువనాయకులకు పార్టీ పదవులను కేటాయించారు. యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పి.శివకుమార్, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం సుమన్, ఉపాధ్యక్షులుగా కందాడ ప్రవీణ్, ఏ.తిరుపతి, కార్యదర్శిగా ఎం. శ్రావణ్, క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా కొలువురి జయరాం, ప్రధాన కార్యదర్శిగా బండి శ్యాంసుందర్, ఉపాధ్యక్షులుగా బెన్నీ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ప్రమోద్, కార్యదర్శిగా కృపాకర్,ఉప కార్యదర్శిగా రఘు వంశీ, కోశాధికారిగా శేషనాగ్, షిండే, పలువురిని పదాధికారులుగా నియమించి ధ్రువీకరణ
పత్రాలను అందజేశారు.
బీఆర్ఎస్ పటిష్టత కోసం అంకితభావంతో పని చేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చేవెళ్లకు చెందిన ఎస్ఎఫ్ఐ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి కార్త్తీక్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే సబితా రెడ్డి, కార్తీక్‌రెడ్డి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.