మల్కాజిగిరి, జూన్ 27: ప్రజల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Rajasekhar Reddy) అన్నారు. గురువారం మేడ్చల్ జిల్లా కార్యాలయంలో బస్తీ దవఖానలు, లైబ్రరీలు, ఎంఎంటీఎస్ రెండో ఫేస్‌లో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెండ్ రూం ఇండ్లు(Double bend room houses) కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ గౌతంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం కోసం కొత్తగా బస్తీ దవఖానలు నిర్మించడానికి, లైబ్రరీలు నిర్మించ డానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలన్నారు. ముదిరాజ్ సంఘానికి కేటాయించిన స్థలం ఇప్పటికి వారికి అందజేయలేదని, వెంటనే స్థలాన్ని అందజేయాలని కోరారు.
బేగంపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అల్వాల్‌కు తరలించాలని, నేరేడ్మెట్ వాజ్‌పేయినగర్‌లోని ఇంటర్, డిగ్రీ కాలేజీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చెరువులు కబ్జాకాకుండా చర్యలు తీసుకోవాలని, తుర్కపల్లి వద్ద ఆర్యూబీ నిర్మించడానికి భూసేకరణ చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్‌గౌడ్, బద్దం పరశురాంరెడ్డి, జేఏసీ అధ్యక్షు డు వెంకన్న, కరమ్‌చంద్, ఢిల్లీ పరమేష్, రమేష్, జీకే హన్మంతరావు, మధుసుదన్ రెడ్డి, తులసి సురేష్, బాలకృష్ణ, అరుణ్‌రావు, సతీష్, తూపాకుల జనార్దన్, అనిల్, సయ్యద్ మోసిన్, ప్రభాకర్, మల్లేష్‌గౌడ్, దినకరన్ తదితరులు పాల్గొన్నారు.