తెలంగాణ బీజేపీలో ప్రతిసారి గ్రూప్ రాజకీయాలు, ఢిల్లీకి ఫిర్యాదులు చేయడం చేస్తారు. అందుకే బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు చోటు దక్కలేదని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నాయకులు మారాలి అని హితవు పలికారు. కాగా, తెలంగాణ బీజేపీకి అధిష్ఠానం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తాజాగా సోమవారం ప్రకటించిన కమిటీలో తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటుదక్కలేదు. అసలే కొన్నేండ్లుగా రాష్ట్రంలో బీజేపీ పనితీరు అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో, దూకుడుగా ప్రతిపక్ష పాత్రను పోషించాల్సింది పోయి.. అధికార కాంగ్రెస్‌తో అంటకాగడం ఢిల్లీ అధిష్ఠానానికి కోపం తెప్పించినట్టున్నది.
ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రం నుంచి జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్న డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌కు ఈసారి చోటు దక్కకపోగా, వారి పదవులు కూడా రెన్యువల్ కాలేదు. కాంగ్రెస్‌తో మిలాఖత్ కావడం, కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ విధానాలను బహిరంగంగా మెచ్చుకోవ డం, స్థానిక ముఖ్యమంత్రికి కితాబులివ్వడం, బీజేపీ జాతీయ నాయకత్వానికి ఏమాత్రం నచ్చలేదు. కాంగ్రెస్‌తో అంటకాగడమే వారి కొంపముంచినట్టు తెలుస్తుండగా, అధిష్ఠానం పెద్దల నిర్ణయంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తెలంగాణ బీజేపీలో ప్రతిసారి గ్రూప్ రాజకీయాలు, ఢిల్లీకి ఫిర్యాదులు చేయడం చేస్తారు
అందుకే బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు చోటు దక్కలేదు
ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నాయకులు మారాలి
– ఎమ్మెల్యే రాజాసింగ్ https://t.co/4X3o0Loj4D pic.twitter.com/46QdQ6GJ94
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026