Raja Singh | అబిడ్స్ : గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని మంగళ్‌హాట్, బేగంబజార్ డివిజన్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రారంభించారు. రూ.58.30లక్షలతో నిర్మించ తలపెట్టిన అభివృద్ధి పనులకు కార్పొరేటర్లు ఎం శశికళ, జీ శంకర్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ గోషామహల్ నియోజకవర్గంలో వాడవాడల అభివృద్ధి పనులు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు విడుదలైన నిధులతో అభివృద్ధి పనులను చేపట్టడంతో పాటు నూతనంగా అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకుగాను నిధుల విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అభివృద్ధి పనులలో నాణ్యత లోపిస్తే ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదన్నారు. అధికారులు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. అంతకుముందు ఆయన దత్తాత్రేయనగర్ మహాలక్ష్మినగర్ ప్రాంతంలో రూ.8లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీరోడ్డు పనులను, మంగళ్‌హాట్ పూసలబస్తీలో రూ.6.50లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను, బేగం బజార్ ఛత్రి ఇడ్లీ గల్లీలో స్టాంప్ వాటర్ లైన్, అ ఫీల్ ఖానాలో రూ.19 లక్షలతో సీసీ రోడ్డు పనులు అదే ప్రాంతంలో 9.8 మరో సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు.