బండ్లగూడ, ఏప్రిల్ 9 : బండ్లగూడలో మంచినీటి సమస్య పరిష్కారానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పి అండ్ టీ కాలనీలో బుధవారం జలమండలి అధికారులు నూతనంగా ఏర్పాటు చేసిన ఫిల్లింగ్ స్టేషన్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇక్కడ ఏర్పాటుచేసిన ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా వీన్టీ కాలనీ, నర్సారెడ్డి కాలనీ, పద్మశ్రీ హిల్స్ రాధానగర్ తదితర ప్రాంతాల్లో మంచినీటి సరఫరా సరఫరా చేసేందుకు ఉపయోగపడుతుంది అన్నారు. క్యాన్ నంబర్ ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 5000 లీటర్ల మంచినీటి ట్యాంకర్ ద్వారా నీటిని పొందొచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి జనరల్ మేనేజర్ మహేందర్ నాయక్, డీజీఎం మహేష్ కుమార్, మేనేజర్ శ్రీనివాస్, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర, మాజీ మేయర్ మహేంద్ర గౌడ్, మాజీ కార్పొరేటర్ పద్మావద్, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.