సికింద్రాబాద్ : ఈ నెల 21వ తేదిన జరిగే సికింద్రాబాద్ లష్కర్ బోనాల ( Lashkar Bonalu ) వేడుకల్లో పాల్గొనాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ను సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ (MLA Padmarao Goud ) ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలిసి ఆహ్వానించారు.
గత కొన్ని సంవత్సరాలుగా సికింద్రాబాద్ బోనాలు వేడుకల్లో పాల్గొని పద్మారావుగౌడ్ నివాసంలో విందుకు కేసీఆర్ హాజరు కావడం రివాజుగా వస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్‌ను పద్మారావు కలిసి బోనాల వేడుకలకు, తన నివాసంలో విందుకు ఆహ్వానించారు. పద్మారావుగౌడ్ తో పాటు ఆయన కుమారులు తీగుల్ల కిషోర్‌గౌడ్, రామేశ్వర్‌గౌడ్, త్రినేత్రగౌడ్, కళ్యాణ్, నాయకులు సుంకు రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.