దళిత బంధు దేశానికే ఆదర్శం
దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే ముఠా గోపాల అన్నారు. దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు
- ముఠా గోపాల్
చిక్కడపల్లి, ఫిబ్రవరి 12: దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే ముఠా గోపాల అన్నారు. దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గాంధీనగర్ డివిజన్‌కు చెందిన బత్తుల కిరణ్‌కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన కారును ఆదివారం ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువజన నాయకుడు ముఠా జయసింహ తో కలిసి ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు. బడ్జెట్లో దళిత బంధు పథకానికి రూ.17, 700 కోట్లను కేటాయించడం అభినందనీయం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే దళిత సంక్షేమం సాధ్యం అని పేర్కొన్నారు. దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్తో సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని వివరించారు. ఈ పథకం దళితుల సాధికారతకు ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్ కుమార్, మజీ కార్పొరేటర్ ముఠా పద్మ,నాయకులు ముఠా నరేశ్,శ్రీనివాస్ గుప్తా, గుండు జగదీశ్ బాబు, మారిశెట్టి నర్సింగ్ రావు, రవి శంకర్‌గుప్తా, పున్న సత్యనారాయణ, పీఎస్ శ్రీనివాస్, రాజ్‌కుమార్, హనుమంతు, జహంగీర్, వెంకటేశ్, చందుకు సురేశ్, ఎంబీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు సీఎంఆర్ఎఫ్తో చేయూత ..
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లక్షలాదిమంది పేదలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నదని ఎమ్మె ల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం భోలక్‌పూర్‌లో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎనిమిది మంది లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రులలో చికిత్స పొందిన వారికి, అత్యవసర శస్త్ర చికిత్స అవసరమైన పేదలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటున్న ఘన త కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, సీఎం కేసీఆర్ ఏ పథకం తీసుకు న్నా పేదల హితం కోసమేనన్నారు. ముఠా జయసింహ, వై. శ్రీనివాసరావు, మక్బుల్, శంకర్‌గౌడ్, సాయి, భీమ్, ప్రవీణ్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

