చిక్కడపల్లి, ఏప్రిల్ 10 : సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్లోని అరుంధతి నగర్ బస్తీలో జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు .
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ, డివిజన్ అధ్యక్షులు రాకేష్ కుమార్, ముచ్చకుర్తి ప్రభాకర్, ముఠా నరేష్, శ్రీకాంత్, పున్న సత్యనారాయణ, పి.రాజమోహన్, శ్రీనివాస్, ఎర్రం శ్రీనివాస్ గుప్త, పాశం రవి, పి రాజ్ కుమార్, జీ వెంకటేష్, ఎస్ టి ప్రేమ, బి కిరణ్ కుమార్, విఠల్, పి సుధాకర్, టి సంతోష్, ఎన్ శ్రీహరి, తలారి యాదగిరి, కుమారస్వామి, రచ్చ నరేష్, కే శ్రీనివాస్, మందుల నరసయ్య, చందు, సురేష్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.