మల్కాజిగిరి, మే 15: భక్తులకు(Devotees) మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) అన్నారు. బుధవారం ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లోని శ్రీ గణపతి దేవాలయ(Ganapati Temple) సప్తమి వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ నియోజక వర్గంలోని అన్ని దేవాలయాలలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మురుగేష్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, దేవాలయ కమిటీ సభ్యులు రామచంద్రమూర్తి, భాస్కరరావు, వెంకటరమణ, రాధకృష్ణ, భీమ శంకర్, శివరామకృష్ణ, నాయకులు ఉపేందర్‌రెడ్డి, చిన్నయాదవ్, నవీన్‌యాదవ్, సూర్యప్రకాష్, అరుణ్, తేజరావు, శ్రీధర్, భరత్, వైశాలి, సూర్యకుమారి, రజిత, కవిత తదితరులు పాల్గొన్నారు.