మల్కాజిగిరి, సెప్పెంబర్ 3: రేషన్ షాపుల డీలర్ల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బోయిన్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్రంలో మొదటిసారిగా నియోజక వర్గంలోని రేషన్ డీలర్ల సమస్యలపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో మూడు నెలలు రేషన్ తీసుకోకుంటే కార్డులను రద్దు చేశారని, వాటన్నిటిని పునరుద్ధరించాలన్నారు.
తెల్ల రే షన్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వం నుం చి సంక్షేమ పథకాలు అర్హులకు అందడంలేని అన్నారు. అంత్యోదయ కార్డులను దివ్యాంగులకు, వితంతువులు, హెచ్ఐవీ వ్యాధిగ్రస్తు లు, డయాలసిస్ రోగులు, కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం మంజూరు చేయాలని అన్నా రు.
కుటుంబంలో పుట్టిన పిల్లల పేర్లు, కొత్త గా పెండ్లి అయిన అమ్మాయిల పేర్లను కార్డు లో చేర్చాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రేషన్ డీలర్లకు నెలకు రూ.5000 ఇవ్వాలని అన్నారు. వారికి ఇచ్చే కమిషన్‌ను పెంచాల ని, గోడౌన్ల నుంచి వచ్చి సరకుల తూకంలో వ్యత్యాసాలు లేకుండా సరకుల సంచులను డీలర్లకు అందజేయాలన్నారు.
కార్యక్రమం లో అసిస్టెంట్ సివిల్ సైప్లె ఆఫీసర్ బాలరాజు, డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పల సం తోష్ కుమార్, కార్పొరేటర్లు సునీతా రాము యాదవ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్, డీలర్లు బాల్‌రెడ్డి, చక్రధర్, రమేష్ సింగ్, శివ కుమార్, కరుణానిధి, వెంకట హరి, నాయకులు జీకే హన్మంతరా వు, కరంచంద్, రమేష్, రాయు యాదవ్, మధుసూదన్‌రెడ్డి, పరమేశ్, భాగ్యనందారావు, వంశీ ముదిరాజ్, సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.