హైదరాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ): ప్రతిపాదిత క్యూర్ బిల్లులో పొందుపర్చిన పలు నిబంధనలపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌కు సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు. బిల్లును చట్టంగా అమలు చేసే ముందు అన్ని కోణాల్లో సమగ్రంగా పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తి, అధికార వికేంద్రీకరణ సూత్రాలను ఈ బిల్లు బలహీనపరుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.‘పట్టణాభివృద్ధి ప్రజాస్వామ్య వికేంద్రీకరణతో కలిసి సాగాలి. క్యూర్ బిల్లు స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి తప్ప..బలహీనపరచకూడదు. ప్రజలకు పాలనలో మరింత భాగస్వామ్యం, అందుబాటు ధరల్లో మున్సిపల్ సేవలు, బాధ్యతాయుతమైన స్థానిక పాలన లభించాలి. ప్రజల ఆందోళనలను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. ప్రజాహితం దృష్ట్యా బిల్లులో తగిన మార్పులు చేస్తుందని ఆశిస్తున్నా.‘ అని ఎమ్మెల్యే మర్రి అన్నారు.