Hrithik – Saba Azad | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, నటి-గాయని సబా ఆజాద్‌తో తమ రిలేషన్షిప్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా హృతిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వ్యక్తిగత ఫోటోలను షేర్ చేస్తూ ఒక లవ్లీ పోస్ట్ పెట్టారు. ఈ జంట తమ ప్రయాణంలోని మధురమైన క్షణాలు, నవ్వులు మరియు ట్రావెల్ మెమోరీస్తో కూడిన ఫొటోలను పంచుకున్నారు. అయితే ఈ పోస్ట్‌కు హృతిక్ మాజీ భార్య సుసాన్ ఖాన్ కూడా స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఫొటోలలో హృతిక్, సబా సరదాగా దిగిన సెల్ఫీలు, సూర్యాస్తమయం సమయంలో సముద్రతీరంలో ఇద్దరూ కలిసి ఉన్న రొమాంటిక్ క్షణాలు ఉన్నాయి. అలాగే రెస్టారెంట్లో చేతులు పట్టుకుని కూర్చున్న ఫోటోలు, విమానంలో ఏవియేషన్ హెడ్‌ఫోన్స్ ధరించి ప్రయాణిస్తున్న ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. హృతిక్ పెట్టిన ఈ పోస్ట్ కింద ఆయన మాజీ భార్య సుసాన్ ఖాన్ స్పందిస్తూ, ‘చాలా స్వీట్.. హ్యాపీ యానివర్సరీ’ అంటూ కామెంట్ చేశారు. హృతిక్, సుసాన్ ఖాన్లు 2014లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక 2022లో హృతిక్, సబా తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు.
హృతిక్ రోషన్ చివరగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘వార్ 2’ చిత్రంలో కనిపించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ కూడా నటించారు. త్వరలో ఆయన ‘క్రిష్ 3’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నారు. మరోవైపు సబా ఆజాద్ ‘సాంగ్స్ ఆఫ్ పారడైజ్’, అలాగే అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో బాబీ డియోల్, సన్యా మల్హోత్రా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘బందర్’ చిత్రాలలో నటించారు.
View this post on Instagram