Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి, ఫిబ్రవరి 8. పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. సీఎంఆర్ఎఫ్కు సంబంధించిన ఎల్ఓసీ పత్రాన్ని బాధితుల కుటుంబానికి అందజేశారు.
మల్కాజ్గిరి డివిజన్ బాల సరస్వతి నగర్ కాలనీకి చెందిన శరణ్ ఎవెలిన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యానికి భారీగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ముఖ్యమంత్రి సహాయనిధికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.2లక్షల ఎల్వోసీ పత్రాన్ని బాధిత కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలు అనారోగ్యానికి గురైన సమయంలో సీఎం సంక్షేమ నిధి ఆపన్నహస్తంలా ఉపయోగపడుతుందని అన్నారు.
కాగా, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నిరుపేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని బాధిత కుటుంబసభ్యులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్ , జేఏసీ అధ్యక్షుడు వెంకన్న, నీలం సతీశ్, తుపాకుల జనార్ధన్, ఉపేందర్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.